వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జువ్వాడి
జగిత్యాల,(విజయక్రాంతి): మొట్టమొదటి వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగ్ రావు(Juvvadi Narsing Rao) ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా జూపల్లి బాలమ్మ వెలమ కన్వెన్షన్, హకీంపేట్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్(Jagityal MLA Dr. Sanjay Kumar) జువ్వాడి నర్సింగ రావుని కలిసి పుష్ప గుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు చిత్ర పటానికి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ... జువ్వాడి రత్నాకర్ రావు కుటుంబం తో నాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని, వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, మాజీ రాజ్య సభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, జువ్వాడి కృష్ణ రావు లు పాల్గొన్నారు.