ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి

15-11-2026 | 05:11pm

సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

ముకరంపుర, నవంబర్ 15(విజయక్రాంతి): ప్రజాసౌమ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ భారత్ సమ్మిట్(BJP Bharat Summit) లో రాహుల్ గాంధీ పాల్గొనడంపై నిరసన వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUDA Chairman Komatireddy Narender Reddy) మండిపడ్డారు. స్థానిక ముకరంపుర లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ అంశాలపై పరిశోధన(Research), విధానపరమైన చర్చలు జరిపి ప్రపంచంలో జరుగుతున్న అనేక అంశాలపై దృష్టి సారించడానికి వేదికగా భారత్ సమ్మిట్(Bharat Summit) నిర్వహిస్తే కేవలం కొంతమంది ఫాసిస్టులకు మాత్రమే కొమ్ముకాస్తూ 12 సంవత్సరాల క్రితం సంపన్నుల జాబితాలో 600 వ స్థానంలో ఉన్న ఆదానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 ఏండ్లలో 2 వ స్థానానికి ఎదిగాడని, వ్యాపారానికి, రాజకీయానికి మధ్య ఉన్న గీత చెరిపేసిన ఘనత బీజేపీ సొంతం అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

సమ్మిట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ వివిధ దేశాల ప్రతినిధుల ప్రసంగాలు శ్రద్ధగా విని అనంతరం సుదీర్ఘంగా ప్రసంగించి దిశా నిర్దేశం చేసి ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ మధ్యలోనే వెళ్లిపోయారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నరేందర్ రెడ్డి విమర్శించారు.ఈ విలేకరుల సమావేశంలో దండి రవీందర్,జీడి రమేష్, కుర్ర పోచయ్య,దన్నా సింగ్, మామిడి సత్యనారాయణ రెడ్డి,నాగుల సతీష్, సాయిరాం,భారీ,లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు