హాస్టళ్లలో లోకల్ పర్చేజ్ విధానం అమలు చేయాలి

11-11-2026 | 03:37pm

బెజ్జంకి, విజయక్రాంతి: మండలంలోని ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో(BC Welfare Hostels) అమలవుతున్న సెంట్రల్ పర్చేజింగ్ విధానాన్ని రద్దు చేసి, గతంలో మాదిరిగా లోకల్ పర్చేజ్ విధానాన్ని అమలు చేయాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగెం(Assistant Secretary Sangem) మధు డిమాండ్ చేశారు.

కేంద్ర విధానంలో సరఫరా అవుతున్న నిత్యావసర సరుకుల నాణ్యత సరిగా లేకపోవడంతో పాటు, సకాలంలో సరఫరా కావడం లేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చలికాలం దృష్ట్యా విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేయాలని, హాస్టల్ వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటూ రాత్రి వేళల్లోనూ హాస్టళ్లలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనలు పాటించని వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు