పాల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: సామాన్యులపై మరోసారి ధరల భారం పడనుంది. ప్రముఖ డెయిరీ సంస్థలు మదర్ డెయిరీ, అమూల్ పాల ధరలను పెంచుతున్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. నవంబర్ 12 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పాల రకాన్ని బట్టి లీటరుపై రూ.2 నుంచి రూ.6 వరకు పెంపు ఉండనుంది.
పాల సేకరణ ఖర్చులు పెరగడం, రైతులకు చెల్లించే ధరలు అధికం కావడం, పాల కొవ్వు ధరలు పెరగడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాల్లో కొంత భారాన్ని వినియోగదారులపై మోపుతున్నట్లు సమాచారం.
మదర్ డెయిరీ కొత్త ధరలు – ఢిల్లీ-ఎన్‌సీఆర్
| పాల రకం | పాత ధర | కొత్త ధర |
| ఫుల్ క్రీమ్ | 72 | 76 |
| టోన్డ్ (ప్యాకెట్) | 60 | 62 |
| టోన్డ్ (బల్క్) | 58 | 60 |
| డబుల్ టోన్డ్ | 54 | 56 |
| ఆవు పాలు | 62 | 65 |
మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. తాజా ధరల పెంపుతో నిత్యావసర ఖర్చులపై కుటుంబాల బడ్జెట్‌కు అదనపు భారం పడనుంది.