సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

11-11-2026 | 03:34pm

దామరచర్ల :నవంబర్ :11: మిర్యాలగూడ పట్టణంలోని ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు(100-Foot Cement Road) నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ సమస్యలను తగ్గించి ప్రమాదాల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ఇదులగూడ జంక్షన్ వద్ద 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే పట్టణం నుంచి ప్రధాన రహదారిపైకి వెళ్లే వాహనదారులకు, ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ , ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు