దామళ్ళ లచ్చమ్మకు ఘన నివాళులు
05-11-2026 | 11:03pm
పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై నివాళులర్పించిన దొడ్డి కొమురయ్య సినిమా నిర్మాణ కమిటీ సభ్యులు
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన దామళ్ళ భాస్కర్ తల్లి దామళ్ళ లచ్చమ్మ (లక్ష్మి) పెద్దకర్మ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దొడ్డి కొమురయ్య సినిమా సహ నిర్మాత, సినిమా నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా చైర్మన్ షేక్ అబ్దుల్ రహిమాన్ హాజరై లచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సినిమా నిర్మాణ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ మందాడి సామ్రాజ్యం, సహ నిర్మాతలు ఆకారపు కృష్ణవేణి, దామళ్ళ భాస్కర్, దారెల్లి మణి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.