లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కూనూరు సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని(Laxman Goud Family) ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Government Whip Vemula Veeresham) పరామర్శించి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పిల్లల చదువుల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని గురువారం హామీ ఇవ్వడంపై తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ... బాధిత కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. లక్ష్మణ్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి సంఘం అండగా ఉంటుందని పేర్కొన్నారు.