తాండూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
తాండూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని(Tandur Tahsildar office) బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) సందర్శించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆక్రమణదారులకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ భూములను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూభారతి దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణీత గడువులోగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ నాయబ్ తహసీల్దార్ కల్పన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.