భూముల రీ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

05-11-2026 | 10:37pm

- కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్(Survey Land Records A.D. Srinivas) లతో కలిసి సర్వేయర్లకు జి.ఎన్.ఎస్.ఎస్. రోవర్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, సంబంధిత రైతులకు ముందుగా సమాచారం అందించి, ప్రతి రైతు రీ సర్వేలో హాజరయ్యే విధంగా టామ్ టామ్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. రీ సర్వే ద్వారా భవిష్యత్తులో భూ సమస్యలు ఉండవని తెలిపారు. ప్రక్రియ నిర్వహణ కొరకు సర్వేలో వినియోగించే 12 రోవర్లను అందించడం జరిగిందని, వీటి ద్వారా ఖచ్చితమైన సర్వేను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ లు, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు