జల మహోత్సవం ప్రారంభించిన సర్పంచ్ అంజ్య నాయక్

05-11-2026 | 11:02pm

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నీటి కొరత నివారించాలి

మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని ముందలి తండా(Mundali Tanda)లో జల మహోత్సవ(Jal Mahotsav) కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అంజ్య నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా చూడాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో గ్రామంలో నీటి కొరత లేకుండా చూడడమే తన లక్ష్యమని తెలిపారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని గ్రామ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు