జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం

05-11-2026 | 10:34pm

మహబూబ్‌నగర్: మున్సిఫ్ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఏ. రఫీ జక్కి(Munsif Staff Reporter M.A. Rafi Jakki) సతీమణి అన్వర్ ఉన్నిసా బేగం అనారోగ్యంతో అల్సర్ ఆపరేషన్ చేయించుకోవడంతో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) ఈ మొత్తాన్ని రఫీ జక్కికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ వాకిట తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు