ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేవగోని రమేష్ గౌడ్ ఎన్నిక

05-11-2026 | 10:57pm

చౌటుప్పల్: చౌటుప్పల్ శ్రీ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయ ఆవరణలో నిర్వహించిన సభ్యుల సమావేశంలో సలహాదారులు పూసుకురి యాదగిరి, మెండే బుచ్చయ్య, చేవగోని వెంకటేష్ గౌడ్, అధ్యక్షుడు ఉడుగు ఇస్తారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.

నూతన అధ్యక్షుడిగా చేవగోని రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సుర్కంటి నర్సిరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా దొనకొండ గోవర్ధన్, చిందం అశోక్, కోశాధికారులుగా ఆరుట్ల లింగస్వామి, ముప్పిడి లింగస్వామి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా సరిపల్లి అశోక్, పూసుకురి శీను, బొంగు శివగౌడ్ ఎంపికయ్యారు. పలువురు సభ్యులను గౌరవ సభ్యులుగా నియమించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చేవగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధితో పాటు ట్రాక్టర్ యజమానుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు