కోదాడలో రూ.250 కోట్ల డ్రైనేజీ పనులపై ప్రజెంటేషన్
ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో వివరించిన అధికారులు
కోదాడ నవంబర్ 29(విజయక్రాంతి): కోదాడ పట్టణంలో(Kodad town) రూ.250 కోట్ల వ్యయంతో చేపడుతున్న భూగర్భ మురుగునీటి(Underground sewage) పారుదల పనులకు సంబంధించి పురపాలక ప్రజారోగ్య శాఖ(Municipal Public Health Department) అధికారులు కోదాడ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ పనుల ప్రణాళిక(Drainage works plan), అమలు విధానం, పనుల పురోగతి తదితర అంశాలను అధికారులు వివరించారని తెలిపారు.
పట్టణ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు కల్పించడం, మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడుతున్నట్లు సమావేశంలో చర్చించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక పాలకవర్గ సభ్యులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.