విద్యారంగం సంక్షోభంలో ఉంది

15-11-2026 | 05:06pm

టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి

ముదిగొండ, నవంబర్ 15 (విజయక్రాంతి): విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ప్రభుత్వాలు విద్యారంగాన్ని, ఉపాధ్యాయ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు చావా రవి(TSUTF President Chava Ravi) అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండలోని నవతేజ ఫంక్షన్ హాల్ లో శనివారం నిర్వహించిన టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులను కాపాడుకునేందుకు టీఎస్ యూటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోవడం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు