జీజీహెచ్ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ధర్నా
ఆసిఫాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి (Government General Hospital)లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో గురువారం ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ.. 10 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం, బోనస్, సెలవులు, యూనిఫారాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లించడంతో పాటు పీఎఫ్ (Provident Fund), ఈఎస్ఐ (Employee State Insurance) నిధులను పూర్తిస్థాయిలో జమ చేయాలని కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన (Protest) చేపడతామని హెచ్చరించారు.
ఈ ధర్నాకు జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ అధ్యక్షత వహించగా గంగాధర్, మాధవి, సువర్ణ, సాంబాజీ, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.