పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు

07-11-2026 | 11:00pm

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పీఎం శ్రీ పథకం(PM SHRI Scheme) కింద ఎంపికైన జిల్లాలోని 18 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ కె.హరిత(Asifabad Collector Haritha) సంబంధిత ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ... పాఠశాలలకు కేటాయించిన నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తూ నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు అదనపు శిక్షణ, యోగా, క్రీడలు, పరిశుభ్రత వంటి సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు