అపస్మారక వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స

07-11-2026 | 10:58pm

బ్లూ కోల్ట్ సిబ్బందికి నగదు ప్రోత్సాహకం ప్రకటించిన ఎస్పీ సంకీర్త్

భూపాలపల్లి, నవంబర్ 07 (విజయక్రాంతి): అత్యవసర సమాచారం(Emergency Information) అందిన వెంటనే స్పందించి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స(First Aid) అందించిన గణపురం బ్లూ కోల్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు. విధి నిర్వహణలో సమయస్ఫూర్తి, మానవత్వం చాటిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

శుక్రవారం మధ్యాహ్నం గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గుర్రం శ్రీను మూర్ఛ కారణంగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు డయల్‌ 112కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన బ్లూ కోల్ట్ సిబ్బంది పీసీ మోహన్, హెచ్‌జీ రాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని శ్రీనుకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అత్యవసర సమయంలో తక్షణమే స్పందించి బాధితుడికి సకాలంలో సహాయం అందించిన పీసీ మోహన్, హెచ్‌జీ రాకేష్‌లను ఎస్పీ సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలుస్తూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎస్పీ సంకీర్త్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు