వడ్డేమాన్ రచ్చకట్టపై వ్యవసాయ ప్రదర్శన

07-11-2026 | 10:58pm

బిజినేపల్లి: మండలంలోని నంది వడ్డేమాన్(Nandivaddeman) గ్రామం రచ్చకట్టపై శనివారం  రావేప్ కార్యక్రమంలో భాగంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేశారు.  రావేప్ కార్యక్రమానికి పాలెం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా.యం.జగన్ మోహన్ రెడ్డి, పాలెం KVK సీనియర్ శాస్త్రవేత్త డా.ఓ. శైల రైతులకు వివిధ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతలు, నూతన వ్యవసాయ పద్ధతులు మరియు వ్యవసాయ మెళకువలపై విలువైన సమాచారాన్ని రచ్చకట్ట వద్ద అందించారు.

రైతులు తమ వ్యవసాయ అనుభవాలు, సమస్యలు మరియు అభిప్రాయాలను శాస్త్రవేత్తలతో చర్చించారు. రావేప్ విద్యార్థులు ఆధునిక సాంకేతికతలు మరియు వ్యవసాయ మెళకువలపై ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. రావేప్ విద్యార్థులు తమ గ్రామీణ అనుభవాలను, రైతులకు అందించిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో నంది వడ్డెమాన్ సర్పంచ్‌, శాస్త్రవేత్తలు డా. దివ్య రాణి, ఏ. శ్రీరామ్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు