రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

07-11-2026 | 10:53pm

ఆసిఫాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): జిల్లా కబడ్డీ అసోసియేషన్(District Kabaddi Association) ఆధ్వర్యంలో నిర్వహించిన సబ్ జూనియర్, సీనియర్ పురుషుల జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలకు మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, క్రీడల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు.

ఎంపికైన జిల్లా క్రీడాకారులు ఈ నెల 12 నుంచి 14 వరకు వికారాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆత్రం ధర్మారావు తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు