ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలి
తిర్యాణి,(విజయక్రాంతి): ఆదివాసీ కోలం గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జనజాతి గౌరవ దివస్ వేడుకల్లో భాగంగా దంతన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన దండారి, గుస్సాడి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేసి సందడి చేశారు. దండారి నిర్వాహకులకు ప్రభుత్వం తరఫున రూ.15 వేల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డీడీ జాదవ్ అంబాజీ మాట్లాడుతూ కోలం గిరిజనుల ఆచారాలు, సంప్రదాయ నృత్యాలు, జీవన విధానం ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.