మచ్చ బొల్లారం – జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం

07-11-2026 | 10:56pm

డంపింగ్ యార్డ్ ఎత్తివేతకై ఈనెల 15 నుండి రిలే నిరాహార దీక్షలు.                 

డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట జేఏసీ పిలుపు.       

జవహర్ నగర్, నవంబర్ 7 (విజయక్రాంతి): మచ్చ బొల్లారం(Maccha Bollaram) చెత్తను జవహర్ నగర్(Jawahar Nagar) లో డంపు చేయడానికి రాంకీ సంస్థకు(Ramky Group) భూ కేటాయింపులు చేపడితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనికి కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రగతి నగర్ లో శనివారం నీలం రామచంద్రయ్య భవన్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి ఆధ్వర్యంలో జేఏసీ కో కన్వీనర్ల సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి హాజరై మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఎత్తివేతకై నవంబర్ 15 నుండి రిలే నిరాహార దీక్షలు చేపడతామని పిలుపునిచ్చారు. జేఏసీ చేపట్టిన ప్రజా ఆందోళన ప్రభావం వలన ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర డిసిసి అధ్యక్షులు వద్రేశ్ యాదవ్ అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారనీ తెలిపారు. జేఏసీ ఏ పార్టీకి అనుకూలం కాదని ఏ నాయకుడికి అనుకూలం కాదని 30 గ్రామాలకు చెందిన 40 లక్షల ప్రజల ఆరోగ్యం భద్రత కొరకు పోరాడుతుందని స్పష్టం చేశారు.

నవంబర్ 3న నాగారంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో చర్చ పూర్తి కాకుండానే  12 రోజుల ప్రణాళిక ప్రకటించడాన్ని జేఏసీకి అభ్యంతరాలు ఉన్నాయన్నారు. మరోవైపు ఈ రోజున వచ్చిన దినపత్రికల్లో మచ్చ బొల్లారం కు చెందిన చెత్తను జవహర్ నగర్ లో డంపు చేయడానికి కలెక్టర్ ఆధ్వర్యంలో గుట్టు చప్పుడు కాకుండా సర్వేనెంబర్ 168 లో ఉన్న ఎకరాల ప్రభుత్వము నీ మచ్చ బొల్లారం డంపింగ్ యార్డ్ కు కేటాయించడం లో దానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ సలహాదారులు రావల్కోల్ నరసింహ, హరిబాబు, కొండల ముదిరాజ్, ఆలూరి రాజశేఖర్, గడ్డం సదానందం, శివన్నారాయణ, భద్రగామిఆంజనేయులు, మేక లలిత యాదవ్, మల్లేష్, సింగరాయ గౌడ్, జాన్, మహమ్మద్ పాషా మియా, జయసుధ, గడిపే సునీత, జావేద్, కె. వేణు, ప్రవీణ్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు