దళారులు, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అంగన్వాడీ(Anganwadi) టీచర్లు, ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు, ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అర్హతల ఆధారంగా ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి సిఫార్సులు, అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, సందేహాలుంటే సంబంధిత శాఖ అధికారులను నేరుగా సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.