జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు రాహుల్ ఎంపిక
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల(Telangana Social Welfare Residential Junior College)లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పుల్లూరి రాహుల్ జాతీయస్థాయి అండర్-19 సాఫ్ట్‌బాల్ పోటీల(U-19 National Softball Tournament)కు ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 22 వరకు పంజాబ్‌లోని చండీగఢ్‌లో జరిగే 70వ ఎస్జీఎఫ్ జాతీయ పోటీల్లో పాల్గొననున్నాడు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు విజయంలో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. రాహుల్‌ను ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, కోట యాదగిరి, ఎస్. ప్రసాద్, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి బి. బాబురావు, హౌస్ మాస్టర్ డి. శ్రీనివాస్, అధ్యాపక బృందం అభినందించారు.