హామీలను నెరవేర్చని కాంగ్రెస్.. బీఆర్ఎస్ నిరసన

17-11-2026 | 08:07pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Laxmi) విమర్శించారు. మంగళవారం ఆమె ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు హామీ పత్రాలను డస్ట్‌బిన్‌లో వేసి నిరసన తెలిపారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ హైమద్ నాయకులు రవీందర్, నిసార్, సాయి, సలాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు