టి.ఏ.జి.ఎస్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):ఆదివాసీల హక్కుల పరిరక్షణ(Protection of Adivasi Rights) కోసం ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) (టి.ఏ.జి.ఎస్.) 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహాసభల గోడ ప్రతులను ఐటీడీఏ పీఓ మంద మకరంద, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎంపీ మీడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వేరు వేరుగా ఆవిష్కరించారు. నవంబర్ 28న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఆదివాసీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆదివాసీల భూమి, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, సంస్కృతి పరిరక్షణ అంశాలపై మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఏ.జి.ఎస్. జిల్లా కార్యదర్శి కోరేంగ మాలశ్రీ, ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్, ముంజం ఆనంద్ కుమార్, దుర్గం దినకర్, గొడిసెల కార్తీక్, నరేష్, గుంవంతరావు తదితరులు పాల్గొన్నారు.