నాటుసారా తయారీపై ఎక్సైజ్ దాడులు
- కూడలి గ్రామంలో మూడు కేసులు నమోదు
- 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.. మహిళ అరెస్టు
మోతె, నవంబర్ 17 (విజయ క్రాంతి): నాటుసారా తయారీ, నిల్వపై ఎక్సైజ్ అధికారులు(Excise officials) దాడులు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టి మూడు కేసులను గుర్తించారు. నాటుసారా తయారీకి సిద్ధం చేసిన 400 లీటర్ల పులియబెట్టిన బెల్లం పానకాన్ని, మరోచోట 200 లీటర్ల పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.
మరో కేసులో ఓ మహిళ ఇంట్లో తనిఖీ చేయగా 25 కిలోల నల్లబెల్లం, రెండు లీటర్ల నాటుసారా లిక్కర్ లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని సోనీ అనే మహిళను అరెస్టు చేశారు. మొత్తం 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, రెండు లీటర్ల నాటుసారా, 25 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.ఎక్సైజ్ ఎస్‌ఐ శివచరణ్ రెడ్డి, సిబ్బంది జావీద్, కృష్ణ, నవీన్, పృథ్వీ, మొయిన్ పాల్గొన్నారు. సూర్యాపేట ఎక్సైజ్ సీఐ కె. స్టీవెన్సన్ పర్యవేక్షణలో దాడులు జరిగాయి.