పోలీస్ సిబ్బందికి స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

17-11-2026 | 08:10pm

నిర్మల్ నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో వివిధ క్రీడా విభాగాల్లో పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) క్రీడ కిట్లను అందజేశారు. డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి పోలీస్ సిబ్బందికి వివిధ క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. పోలీస్ సిబ్బందిలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడంతో పాటు శారీరక దృఢత్వం, జట్టు సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ పి. శ్రీనివాస్, నిర్మల్ జిల్లా డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, భైంసా, నిర్మల్ డివిజన్ల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే క్రీడా పోటీల్లో పోలీస్ సిబ్బంది క్రీడా స్ఫూర్తితో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఎస్పీ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు