కార్మికుడి కుటుంబానికి రూ.29 లక్షల పరిహారం అందజేత
17-11-2026 | 08:04pm
అండగా నిలిచిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, నవంబర్ 17: పాశమైలారం పారిశ్రామికవాడలోని ల్యాంప్‌టఫ్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడు జి. దానయ్య కుటుంబానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అండగా నిలిచారు. యాజమాన్యంతో చర్చించి రూ.29 లక్షల నష్టపరిహారం అందేలా కృషి చేశారు. మంగళవారం పటాన్‌చెరులోని క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులను అందజేసి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీకాకుళం సంక్షేమ సంఘం నాయకులు భాస్కర్, వాసు తదితరులు పాల్గొన్నారు.