కన్నతల్లిని హింసిస్తున్న కొడుకు

17-11-2026 | 07:36pm

జగిత్యాల, నవంబర్ 17 ( విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిర్మలాపూర్ గ్రామానికి(Tirmalapur Village) చెందిన వడ్లకొండ  హన్మవ్వ (80) అనే అనారోగ్యం తో భాద పడుతున్న వృద్ధ తల్లిని పెద్ద కొడుకు రవి పోషణ, వైద్య ఖర్చులు పెట్టకపోగా  మరణించిన భర్త పేరిట ఉన్న  పట్టా భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ప్రతి రోజు కొడుతూ రిజిస్ట్రేషన్ చేయకపొతే చంపుతానని హింసలకు గురిచేస్తున్నాడని   జగిత్యాల జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు,

న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించింది. కాగా ఆ వృద్ధురాలు మంగళవారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వృద్ధ తల్లి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో తన గోడు విలేకరులకు వినిపించారు.

తన భర్త, చిన్న కొడుకు మరణించగా పెద్ద కొడుకు రవి కి గతం లోనే 0-15 గుంటలు పట్టా చేశానని, అనారోగ్యం తో భాద పడుతున్న నాకు పోషణ, వైద్య ఖర్చులు పెట్టక పోగా, నా భర్త పేరిట ఉన్న 20 గుంటల పట్టా భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ప్రతి రోజు కొడుతూ చంపుతానని హింసలకు  గురి చేస్తున్నాడని నాకు నా కొడుకు తో ప్రాణ భయం ఉందని,

పెద్ద కొడుకు పై తగు చర్యలు తీసుకొని, నా భర్త పేరిట ఉన్న భూమిని  గొల్లపల్లి తహసీల్దార్ చేత వెంటనే నా పేరిట పట్టా చేయించాలని ఆర్డీవో ను కోరగా తగు చర్యలు తీసుకుంటామని, పోషణ, వైద్య ఖర్చులు  ఇచ్చేలా వృద్ధతల్లి దండ్రుల పోషణ, సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారని, గొల్ల పల్లి పోలీస్ అధికారులు కూడా తనకు వెంటనే రక్షణ కల్పించాలని ఏడుస్తూ కోరింది.

ఆ వృద్ధ తల్లి వెంట  సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్, చట్టం కాన్సిలియేషన్ అధికారులు పి. సి. హన్మంత్ రెడ్డి, వెల్ముల ప్రకాష్ రావు, కరుణ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు