గోవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది

15-11-2026 | 05:00pm

కాగజ్ నగర్ (విజయక్రాంతి): సమాజంలో గోవుల సంరక్షణ, పెంపకం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సీనియర్ న్యాయమూర్తి అనంతలక్ష్మి(Judge Ananthalakshmi) అన్నారు. ఆదివారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ పై గల గోశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గోశాలలో ఆవుల పెంపకం, పశుగ్రాసం, పాల ఉత్పత్తులపై గోశాల అధ్యక్షులు పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పోతురాజుల లక్ష్మణులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్రిశూల్  పహాడ్ పై గల శ్రీ సత్యనారాయణ స్వామి, దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోశాల కార్యదర్శి పోలోజు శ్రీనివాస్, సభ్యులు అరుణ్ అగర్వాల్, ప్రసాద్ ,సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు