థ్రిల్ పంచే స్టైలిష్ లవ్‌స్టోరీ

05-11-2026 | 05:10am

అక్కినేని నాగార్జున సమర్పణలో(Presented by Akkineni Nagarjuna) తెరకెక్కుతున్న ‘ఇట్లు అర్జున’ చిత్రంతో అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల(Venky Kudumula) నిర్మిస్తున్నారు. ఇందులో అనస్వర రాజన్(Anaswara Rajan) కథానాయిక. బుధవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా.. “ఒక్క మాట కూడా మాట్లాడకుండా డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్‌కి నిదర్శనం. నీ మొదటి సినిమాకే ఇలాంటి పాత్రను ఎంచుకోవడం చూస్తుంటే, అన్నింటికంటే కథపై నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.

నీకు అద్భుతమైన ఆరంభం లభించాలని కోరుకుంటున్నా బ్రదర్. నవంబర్ 13న విడుదల కానున్న మీ సినిమాకు నా శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు. ఇక ట్రైలర్ చూస్తే.. రొమాన్స్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్‌తో కూడిన ఆసక్తికరమైన లవ్ స్టోరీని థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న కథ ఇది అని అర్థమవుతోంది. ఈ చిత్రానికి రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీని, థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు