తెలుగునాట ఓం
వెర్సటైల్ స్టార్ ధనుష్(Dhanush), మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) ప్రధాన పాత్రల్లో నటిస్త్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్(Pan-India action thriller) ‘ఓం: చాప్టర్ 1(Om: Chapter 1) రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఈ సినిమాలో సాయిపల్లవి(Sai Pallavi), శ్రీలీల, నజీరుద్దీన్ షా, ఇంద్రన్స్, చైతు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్నారు.
నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుం డగా, ఎళిల్ అరసు కే సినిమాటో గ్రాఫర్‌గా, ఆర్ కళైవానన్ ఎడిటర్‌గా, ఏ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.