విజ్ఞాన్స్ వర్సిటీకి జాతీయస్థాయి పురస్కారాలు
చాన్సలర్ డాక్టర్ పావులూరి సుబ్బారావుకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్
సీఈవో డాక్టర్ మేఘన కూరపాటికి ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డు
హైదరాబాద్, అక్టోబర్ 31(విజయక్రాంతి): విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి, దేశ ప్రగతికి విశేష సేవలందిస్తున్న విజ్ఞాన్స్ వర్సిటీ(Vignan's University) చాన్సలర్ డాక్టర్ పావులూరి సు బ్బారావుకు ప్రతిష్ఠాత్మకమైన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించిందని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేవీ క్రిష్ణకిషోర్ శనివారం తెలిపారు.
అదేవిధంగా విద్యా, పరిశోధన రంగాల్లో విశిష్ట సేవలందిస్తూ, అకడమిక్ నాయకత్వంలో ప్రతిభ కనబరుస్తున్న వర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటికి ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డు ప్రదానం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టి ట్యూట్ (ఎన్జీఆర్‌ఐ)లో నిర్వహించిన సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అకాడమీ (ఏఎస్టీసీ) వార్షిక సదస్సు2026 సందర్భం గా వారికి ఈ పురస్కారాలను అందజేశారు.
ఎర్త్ సైన్సెస్, వ్యూహాత్మక వనరులు, భారతదేశ భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై నిర్వహించిన ప్రత్యేక శాస్త్రీయ సదస్సులో భాగం గా అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. అంతరిక్ష, రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి డాక్టర్ పావులూరి సుబ్బారావు అందిస్తున్న విశేష సేవలు, దూరదృష్టితో కూడిన నాయకత్వం, సాంకేతిక ఆవిష్కరణలకు అందిస్తున్న ప్రోత్సాహం, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తిస్తూ కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ తుమ్మల శ్రీనివాస కుమార్ ఈ ప్రతిష్ఠాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.
అదేవిధంగా విద్యారంగంలో నాణ్యమైన విద్యను అందించడం, పరిశోధనలను ప్రోత్సహించడం, విద్యాసంస్థల అభివృద్ధికి నాయ కత్వం వహించడం, ఉన్నత విద్యారంగంలో నూతన ప్రమాణాలను నెలకొల్పడంలో వ ర్సిటీ సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి చే స్తున్న కృషికి గుర్తింపుగా ఆమెకు ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డుతో సత్కరించారు. వర్సిటీ చాన్సలర్‌కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అ వార్డు, సీఈవోకు ఎక్సలెంట్ అకడమిషియన్ అవార్డు లభించడం సంస్థకు గర్వకారణమని వైస్ చాన్సలర్ పేర్కొన్నారు. ఈ పురస్కారాలు విజ్ఞాన్ విశ్వవిద్యాలయం శాస్త్ర సాంకేతిక, పరిశోధన, ఉన్నత విద్యారంగాల్లో సాధిస్తున్న ప్రగతికి మరింత గుర్తింపునిచ్చాయన్నారు. విశ్వవిద్యాలయానికి గర్వ కార ణంగా నిలిచిన ఈ రెండు పురస్కారాల పట్ల వర్సిటీ రిజిస్ట్రార్, వివిధ విభాగాల డీన్లు, విభాగాధిపతులు హర్షం వ్యక్తం చేస్తూ చాన్సలర్, సీఈవోకి అభినందనలు తెలిపారు.