తాళ్లపూసపల్లి, ఉప్పరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక

15-11-2026 | 04:25pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి, ఉప్పరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలను ఎన్నిక(Election) చేసినట్లు మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ తెలిపారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy), పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,స్థానిక శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ ఆదేశాల మేరకు కేసముద్రం మండలంలో గ్రామ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించినట్లు సమ్మయ్య గౌడ్ తెలిపారు.

తాళ్లపూసపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య అధ్యక్షతన,ఉప్పరపల్లి గ్రామం లో గ్రామపార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు అధ్యక్షతన,మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల తో కలిసి నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు.

తాళ్లపూసపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులుగా కాలేరు వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా గౌండ్ల లక్ష్మణ్, ఉపాధ్యాక్షలుగా  శీలం యాకన్న,కోశాధికారిగా నరేటి సుధాకర్ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప్పరపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గా శాగంటి రాములు, ప్రధానకార్యదర్శి గా తండ సంపత్ కుమార్, కోశాధికారిగా ముదురుకోళ్ల రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మరిన్ని వార్తలు