12 పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ అండ
రూ.5 లక్షల విలువైన చెక్కుల పంపిణీ..
ఆపన్నులకు మాజీ జెడ్పిటిసి ఆర్. సంతోష్ కుమార్ భరోసా
వేమనపల్లి ( విజయక్రాంతి ): పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల(Medical expenses) భారం తగ్గించి ఆర్థిక భరోసా(Financial Security) కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 12 మంది లబ్ధిదారులకు(Beneficiaries) రూ.5 లక్షల విలువైన చెక్కులను మంచిర్యాల జిల్లా(Mancherial District) వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో పంపిణీ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదేశాల మేరకు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్, జిల్లా మైనార్టీ నాయకుడు సాబీర్ అలీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి మధుతో కలిసి చెక్కులు అందజేశారు.
సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేదలకు వైద్యం భారంగా మారకుండా ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి నాయకత్వంలో ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.