ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సందీప్ జీని కలిసిన ఎమ్మెల్యే

28-11-2026 | 07:14pm

మహబూబాబాద్: హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి సందీప్(AICC Telangana in-charge Sandeep) జీని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డీ సీ సీ మాజీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా సందీప్ జీని శాలువాతో సత్కరించి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మహబూబాబాద్ జిల్లా, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడం వంటి అంశాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కంకర అయ్యప్ప రెడ్డి,జిల్లా నాయకులు దేవరం ప్రకాష్ రెడ్డి, మిట్టకంటి రాం రెడ్డి , నాయిని సత్యపాల్ రెడ్డి, ఎండీ జమీల్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు