కోర్టు కానిస్టేబుల్ సైదులుకు ఎస్పీ ప్రశంసా పత్రం

28-11-2026 | 07:17pm

* హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి..

* విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు

గరిడేపల్లి, నవంబర్ 28,(విజయ క్రాంతి) : గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో(Garidepalli Police Station) కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డుపల్లి సైదులును(Boddapalli Saidulu) జిల్లా ఎస్పీ నరసింహ(District SP Narasimha) అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో 2015లో జరిగిన హత్య కేసులో(murder case) నలుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడేలా సమర్థవంతంగా విధులు నిర్వహించినందుకు ఆయనకు ఈ గుర్తింపు లభించింది.

కేసు విచారణ సమయంలో సాక్ష్యాలను క్రమబద్ధంగా న్యాయస్థానానికి సమర్పించడం, కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందించడంలో కానిస్టేబుల్ సైదులు కీలక పాత్ర పోషించారు. హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, అప్పటి ఎస్‌ఐ నరేష్ పర్యవేక్షణలో దర్యాప్తు, విచారణ ప్రక్రియలో సమన్వయంతో పనిచేసి నిందితులకు శిక్ష పడటానికి కృషి చేశారు. దీంతో బాధిత కుటుంబానికి న్యాయం చేకూరింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ కానిస్టేబుల్ సైదులును ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. గరిడేపల్లి పోలీస్ స్టేషన్ ప్రస్తుత ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ సైతం సైదులును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు