మహిళా సంఘాలకు మరింత బలోపేతం
గ్రామీణ మహిళల ఆత్మగౌరవానికి VO భవనాలు అండగా నిలుస్తాయి
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో మహిళా సంఘాల(women's self-help groups) కార్యకలాపాల నిర్వహణ కోసం నిర్మించనున్న VO భవన నిర్మాణ పనులకి మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) శనివారం అదనపు కలెక్టర్ చంద్రయ్య, DRDO కిషన్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు, గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు.
మహిళా సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. VO భవనం నిర్మాణం పూర్తయితే మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు కార్యక్రమాలు, వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎం ఎల్ ఏ PSR పేర్కొన్నారు. మహిళలు సంఘటితంగా ముందుకు సాగుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఈ భవనం ఒక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో హజీపూర్ MPO సుమన్, తహసిల్దార్ పుష్పలత, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు, హజీపూర్ మండల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ తోట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, సర్పంచ్ బేతు రమాదేవి, నాయకులు తనుగుల సత్యం గౌడ్, రేవెల్లి ప్రసాద్, గూడ అంజి, కోట నవీన్ గౌడ్, జాడి విజయ్, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..