హుజూర్ నగర్ తహసీల్దార్‌గా హరి ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

11-11-2026 | 03:25pm

హుజూర్ నగర్, నవంబర్ 11: హుజూర్ నగర్ మండల తహసీల్దార్(Mandal Tahsildar) (ఎఫ్‌ఏసీ)గా బాశెట్టి హరి ప్రసాద్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ తహసిల్దారుగా పనిచేసిన బండ కవిత భూ వివాదంలో సస్పెన్షన్ కావడంతో సూర్యాపేట ఆర్డీవో కార్యాలయంలో(Suryapet RDO Office) డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (డీఏఓ)గా విధులు నిర్వర్తించిన హరి ప్రసాద్ ను హుజూర్ నగర్ తహసీల్దార్‌ గా జిల్లా కలెక్టర్ నియమించారు.

నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు... మండలంలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత వేగంగా పారదర్శకంగా అందిస్తామని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.అనంతరం నూతన తహసీల్దార్‌ను రెవెన్యూ కార్యాలయ సిబ్బంది,పలువురు అధికారులు  కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు