ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

21-11-2026 | 12:28pm

కేసముద్రం: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల, పట్టణ పరిధిలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యదర్శి నీలం దుర్గేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మత్స్య పరిశ్రమ అభివృద్ధి (Fisheries Development), సుస్థిర మత్స్య వనరుల నిర్వహణ, మత్స్యకారుల హక్కులు, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు దుర్గేష్ తెలిపారు. ఇందులో భాగంగా అవగాహన సదస్సులు (Awareness Programs), ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మత్స్యకార సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలు, హక్కులు, సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు