పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ భరోసా
నల్లబెల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఎంతో భరోసానిస్తుందని నల్లబెల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్ అన్నారు. నారక్కపేట గ్రామానికి చెందిన నలుగురు లబ్ధిదారులకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మంజూరు చేయించిన రూ.2.01 లక్షల విలువైన చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన తిప్పని లక్ష్మీనారాయణకు రూ.1.40 లక్షలు, బొచ్చు రంజిత్‌కు రూ.37 వేలు, లకిడి వీరన్నకు రూ.13 వేలు, పోగుల రాజేశ్వరికి రూ.11 వేల చొప్పున చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund) ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అశోక్ తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు కుంచాల రాజు, గ్రామ కమిటీ గౌరవ అధ్యక్షుడు తిప్పని చేరాలు, ఉపాధ్యక్షులు శ్రీపతి కుమారస్వామి, సూరవ్ శ్రీను, ప్రధాన కార్యదర్శి పాక కుమారస్వామి, కార్యదర్శులు దిడ్డి అశోక్, కోడూరు రాయసాబ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మామిడి కృష్ణ, వార్డు సభ్యులు మేరుగు శివ, ఆడప్ప చంద్రకళ రాజు, నాయకులు దండెం రాజేష్, కోడూరు రాజశేఖర్, కావట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.