రెడ్డిపల్లిలో శ్రీకృష్ణ తులాభారం కనువిందు
గండీడ్, నవంబర్ 21 (విజయక్రాంతి): మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర కళానాట్య భజన మండలి ఆధ్వర్యంలో గత రాత్రి ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకం శ్రీకృష్ణ తులాభారం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీకృష్ణ రాయబారంలోని పలు ఘట్టాలను సైతం ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నంది అవార్డు గ్రహీత బి. కిషన్ బాబు మాస్టర్ సంగీత దర్శకత్వం (Music Direction) వహించారు. చాపల వెంకటయ్య, సన్ డ్రాస్ వెంకటరాములు, పల్లె శ్రీనివాస్ రెడ్డి, తోకలి కృష్ణ, పిట్ల శ్రీను, గాజుల సాయన్న, గాజుల కేశవ్, మాలే తిమ్మన్న, కటికే శంకర్, కటికే యాదోజి, కె. రాజేందర్, పి. శివ, నంది అవార్డు గ్రహీత డా. రత్నశ్రీ, తిరుమల తదితరులు వివిధ పాత్రల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రస్తుత కాలంలో పౌరాణిక పద్య నాటకాలు (Mythological Drama) కనుమరుగవుతున్న నేపథ్యంలో రెడ్డిపల్లిలో నిర్వహించిన ఈ ప్రదర్శన కళాభిమానులకు కనువిందు చేసింది. సంప్రదాయ కళారూపాల పరిరక్షణకు (Cultural Heritage) ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ నాటక ప్రదర్శనలో స్థానిక సర్పంచ్ గొల్ల సత్యమ్మ, ఉపసర్పంచ్ పారిజాత, వార్డు సభ్యులు, మండల భజన మండలి అధ్యక్షుడు ఏదుల బుగ్గన, పల్లె చెన్నారెడ్డి (పంతులు), సంగీత విద్వాంసులు, గ్రామ పెద్దలు, ప్రేక్షకులు తదితరులు పాల్గొన్నారు.