జనరల్ బోగీలో విజయ్ ఆంటోనీ

21-11-2026 | 12:31pm

సినిమా ప్రమోషన్ అంటే భారీ ఈవెంట్లు, స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్లు, గ్రాండ్ ఇంటర్వ్యూలే కాదు.. సామాన్యులతో నేరుగా మమేకమైతే కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించవచ్చని నిరూపిస్తున్నారు నటుడు విజయ్ ఆంటోనీ. తన తాజా చిత్రం ‘అప్పా కుట్టి’ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన వినూత్నమైన పద్ధతిని ఎంచుకున్నారు. ఏకంగా రైలు జనరల్ బోగీలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

శనివారం ఉదయం 6 గంటలకు చెన్నై నుంచి బయలుదేరిన కోవై ఎక్స్‌ప్రెస్‌లో విజయ్ ఆంటోనీ కోయంబత్తూరుకు వెళ్లారు. ఎలాంటి ప్రత్యేక హంగులు లేకుండా జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులతో కలిసి కూర్చున్నారు. వారితో సరదాగా మాట్లాడటమే కాకుండా తన సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. ఈ ప్రయాణంలోని ఆసక్తికరమైన సందర్భాలను Travel Vlog రూపంలో రికార్డ్ చేస్తున్నారు. ప్రయాణికుల స్పందనలు, వారి అనుభవాలతో రూపొందించే ఈ వీడియోను సినిమా Promotionలో భాగంగా త్వరలో విడుదల చేయనున్నారు.

కోయంబత్తూరుకు చేరుకున్న తర్వాత అక్కడి థియేటర్లను సందర్శించి ప్రేక్షకులను నేరుగా కలవాలని విజయ్ ఆంటోనీ ప్లాన్ చేశారు. సినిమా చూసిన వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు అభిమానులతో ముచ్చటించనున్నారు. ప్రేక్షకులతో Direct Interaction ఉండేలా ఈ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోనీ, ప్రీతి అస్రానీ జంటగా నటించిన ‘అప్పా కుట్టి’కి ము మారన్ దర్శకత్వం వహించారు. భావోద్వేగ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందే ఈ సినిమా లాభాలను నమోదు చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఇటీవల జరిగిన Pre-release Eventలో విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. తమ కుమార్తె మీరా మరణం తర్వాత విజయ్ ఆంటోనీ చెప్పులు ధరించడం మానేశారని, ఖరీదైన వాచ్‌లకు బదులుగా ఆమె ఉపయోగించిన వాచ్‌నే ధరిస్తున్నారని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు