దాడి కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

05-11-2026 | 11:07pm

కోనరావుపేట,(విజయక్రాంతి): భూ వివాదం నేపథ్యంలో దాడి(Land Dispute Attack)కి పాల్పడిన ముగ్గురు నిందితులకు సిరిసిల్ల మెజిస్ట్రేట్ గడ్డం మేఘన(Sircilla Magistrate Gaddam Meghana) మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించినట్లు కోనరావుపేట ఎస్‌ఐ రామమోహన్ తెలిపారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎగ్లాస్‌పూర్ గ్రామానికి చెందిన పిట్టల రాములు, పిట్టల చంద్ర మౌళి, పిట్టల తిరుపతిలు 2018 మే 23న అదే గ్రామానికి చెందిన ఫిర్యాదుదారురాలి కుటుంబ సభ్యులపై భూ వివాదం నేపథ్యంలో దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఫిర్యాదుదారురాలి భర్త, మామ తీవ్రంగా గాయపడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ ఎస్‌ఐ కె. శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టడంలో సహకరించారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదనలు వినిపించారు. విచారణలో నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లదించినట్లు కోనరావుపేట ఎస్‌ఐ రామమోహన్ తెలిపారు.

మరిన్ని వార్తలు