ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు

05-11-2026 | 10:14pm

రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకురావాలి

సిద్దిపేట రూరల్: రైతులు(Farmers ) ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికే తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని  బుస్సా పూర్ గ్రామ(Busapur Village) సర్పంచ్ రామసాగరం ఐలా రెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో వానాకాలం సీజన్‌కు సంబంధించి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్  మాట్లాడుతూ... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సెంటర్ నిర్వహకులకు సూచించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా గ్రామ పంచాయతీ తరఫున సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ రాజ మల్లయ్య,ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు