దొంగను కట్టేసి చితకబాదిన గ్రామస్తులు

18-11-2026 | 12:35am

చేగుంట నవంబర్ 17 (విజయక్రాంతి): బైక్ దొంగల హల్చల్, దొంగను పోల్ కట్టేసి చితకబాదిన సంఘటన సోమవారం రాత్రి మసాయిపేట్(Masaipet) కేంద్రంలో చోటు చేసుకుంది, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు కలిసి శ్రీనివాస్ నగర్ కాలనీలో అనుమానాస్పదంగా సంచరించడంతో ఇది గమనించిన స్థానికులు వారిని పట్టుకుని ప్రయత్నం చేశారు.

నలుగురు వ్యక్తులు పారిపోగా ఒక వ్యక్తి గ్రామస్తులకు చిక్కాడు. అతని వద్ద బైకులకు సంబంధించిన తాళాలను గుర్తించి వారంతా బైకు దొంగతనంకు వచ్చినట్లు భావించి, అతడిని దేహ శుద్ధి చేశారు. అనంతరం చేగుంట పోలీసులకు సమాచారం అందించి నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

మరిన్ని వార్తలు