ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి

07-11-2026 | 10:49pm

 ఎమ్మెల్యే కోవ లక్ష్మి

జైనూర్, నవంబర్ 7 (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు(Aboriginal culture and traditions) దండారి పండుగ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) అన్నారు. శనివారం జైనూర్ మండలంలోని సుకుడ్‌పల్లి, దేవుగూడ, జాంగం, మని జండాగూడ, గుడామామడ, పాట్నపూర్ గ్రామాల్లో నిర్వహించిన దండారి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీల ఆచారాలు, కళారూపాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గోండు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో యువకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు