జెమీమా రీఎంట్రీ

10-11-2026 | 05:05am

సఫారీ టూర్‌కు భారత జట్టు ప్రకటన

ముంబై, నవంబర్ 9: వచ్చే నెలలో జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ(BCCI) ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues) తిరిగి జట్టులోకి వచ్చింది. అమన్‌జోత్ కౌర్ కూడా ఫిట్‌నెస్ సాధించడంతో ఎంపికైంది. అయితే ఆమెను టీ20లకు మాత్రమే తీసుకున్నారు. ఇక తెలుగమ్మాయి శ్రీచరణి మూడు ఫార్మాట్లలోనూ చోటు దక్కించుకోగా, హైదరాబాదీ ప్లేయర్ కేవలం టీ20 జట్టులోకి మాత్రమే ఎంపికైంది.

ఇటీవల జింబాబ్వే సిరీస్‌తో అంతర్జాతీయ అరం గేట్రం చేసిన పేస్ బౌలర్ కలిత వన్డే, టెస్ట్ జట్టులో చోటు దక్కించుకుంది. అటు జట్టు లో దీప్తి శర్మ, శ్రీచరణి, ప్రేమా రావత్ రూ పంలో స్పిన్నర్లు ఉండడంతో శ్రేయాంకా పటేల్‌కు నిరాశే మిగిలింది. ఈ పర్యటనలో భారత మహిళల జట్టు ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీట్వంటీలు ఆడనుంది. కెప్టెన్‌గా స్మృతి మంధానకు ఇదే తొలి విదేశీ సిరీస్. డిసెంబర్ 9 నుంచి జరిగే ఏకైక టెస్టు తో భారత మహిళల సఫారీ టూర్ మొదలవుతుంది.

టెస్టు జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీక రావల్, హర్మన్‌ప్రీత్, జెమీమా, హర్లీన్ డియోల్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి, శ్రీచరణి, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, నందని శర్మ, జింతిమణి, సయాలి.

వన్డే జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, ప్రతీక రావల్, హర్మన్‌ప్రీత్, జెమీమా , హర్లీన్ డియోల్, రిచా ఘోష్(వికెట్ కీపర్), యస్తిక భాటియా(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీచరణి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, నందని శర్మ, జింతిమణి, సయాలి.

టీ20 జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా, హర్మన్‌ప్రీత్, నిక్కీ ప్రసాద్, రిచా ఘోష్, కమలిని, అనుష్క శర్మ, దీప్తి శర్మ, శ్రీచరణి, ప్రేమ రావత్, అమన్‌జోత్, క్రాంతి, నందని, రేణుక, అరుంధతి, సయాలి.

మరిన్ని వార్తలు