మన డాక్టర్ బాబే మంచి విజయం దక్కాలి
స్కంద ఫిలమ్స్ బ్యానర్‌పై(Skanda Films banner) కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే(Mana Doctor Babe)’. ఈ సినిమాతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. మోహన సిద్ధి, శ్రుతి శంకర్, అలీ తదితరులు ముఖ్యపాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 20న విడుదల చేయబోతోన్నారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మన డాక్టర్ బాబే’ చిత్రంతో నిర్మాతగా, హీరోగా వస్తున్న శ్రీ స్కందకి ఆల్ ది బెస్ట్.
ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో శ్రీ స్కంద మాట్లాడుతూ.. “చలపతి ఈ మూవీని గొప్పగా, నవ్విస్తూ మంచి సందేశాన్ని ఇచ్చేలా రూపొందించారు. భావోద్వేగాలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి” అని చెప్పారు. ‘మా సినిమా నవంబర్ 20న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని దర్శకుడు చలపతి కుమార్ కోరారు. నటీనటులు అలీ, శ్రుతి శంకర్, మోహన సిద్ధి, ‘కూర్మావతారం’ చిత్ర దర్శకుడు హర్షవర్ధన్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు.