507 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు
47 మందికి కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
గండీడ్,నవంబర్ 16, విజయక్రాంతి: అర్హులైన పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని పరిగి ఎమ్మెల్యే, డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(MLA Rammohan Reddy) (TRR) అన్నారు. మండల కేంద్రంలోని కేజీబీవీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన 507 మంది అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పింఛన్లు పేదల జీవితాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 47 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.47,05,452 విలువైన కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.మండలంలోని రెడ్డిపల్లి, రంగారెడ్డిపల్లి, వెన్నచేడ్ గ్రామాల్లో పీఏసీఎస్ (PACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిగి ఎమ్మెల్యే, ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత లక్ష్మారెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ఆర్ భగవంత్ రెడ్డి, తాసిల్దార్ రాజగోపాల్, ఎంపీడీవో మంజుల, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు